ఇదేం వెరైటీ : కొత్తిమీర కట్టలతో పకోడీనా..!

ఇదేం వెరైటీ : కొత్తిమీర కట్టలతో పకోడీనా..!

చలికాలం మొదలైంది.  స్వెట్లర్లు వేసుకొని గజ గజ వణుకుతూ వేడి వేడి పదార్దాలను లాగించేందుకు జనాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు.   అయితే ప్రనంచ వ్యాప్తంగా స్ట్రీట్​ ఫుడ్స్ కు ఎంతో ఆదరణ ఉంది.   రక రకాల వంట కొత్త కొత్త  వంటకాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.  తాజాగా కొత్తిమీర వడలు.. ధనియా పకోడీలకు సంబంధించిన వైరైటీ పుడ్​ వైరల్​ అయింది. 

స్ట్రీట్ ఫుడ్ లవర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్​ అయిన వీడియోలో  శనగపిండిలో.. కొన్ని  మసాలా దినుసులను కలిపి పకోడి పిండిగా తయారు చేశారు.  ఆ తరువాత కొత్తిమీర కట్టలను పిండిలో ముంచి నూనెలో వేయించారు, ఇవి బంగారు గోధుమ రంగులోకి మారిన తరువాత ఓ బౌల్​ లోకి తీసుకున్నాడు.  ఈ వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తూ కొత్తిమీర ఆకులు చాప్​ అనే క్యాప్షన్ తో ఇంటర్​ నెట్​ లో పోస్ట్​ చేశారు.ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.   ఆహార ప్రియులు చాలా మంది ఈ వంటకం పట్ల నిరాశ..నిస్పృహలను వ్యక్తం చేశారు.  పకోడీలు ఎంతో వాసన కలిగి చాలా టేస్టీగా ఉంటాయని కొందరు కామెంట్​ చేశారు.  కొంతమంది పరిశుభ్రత గురించి కామెంట్​ చేశారు.  కొత్తిమీ తాజాదనం గురించి కొంతమంది వివరించారు.  మరికొంతమంది మీకు పరిశుభ్రం అంటే ఏమిటో తెలుసా అని రాశారు.    ఈ రెసిపి వంటకం తయారు చేసినందుకు ధన్యవాదాలు అని ఒకరు రాశారు.